నా జీవితంలో నిజమైన మిత్రులు

మన జీవితంలో ఎక్కడో జరిగే ఇబ్బందికి/ప్రశ్నకి , ఇంకో చోట సమాధానం వెతుకుతాం. ఆలా చేసేటప్పుడు మనం బుర్రకి తక్కువ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఎప్పుడైతే మన భావోద్వేగాలు మన దిశని నిర్దేశిస్తయో చాలా తప్పులు జరిగిపోతాయి. తప్పు చేయటం మనిషి సహజం. అసలు తప్పు చేస్తున్నాం అని తెలిస్తే ఎందుకు చేస్తాం?

మనం ఒక అడుగు ముందుకి వేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఎక్కడో తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. అది ఏదైనా కొత్త విషయం చేయడానికి భయం వాళ్ళ కూడా అనిపించుచు. మరి తప్పు చేస్తున్నామా,లేదా భయపడుతున్నామా ఎలా తెలుస్తుంది? ఒకటే ఒక ప్రశ్న - అసలు ఆ పని ఎందుకు చేస్తున్నాము అని ఒక స్పష్టత ఉంటె అప్పుడు మనం చేసేదానికి అడ్డు పడేది భయం . భయానికి మనం లొంగిపోకూడదు, అది దాటి ముందుకు వెళ్ళాలి.

కానీ ఒక వేళ అది భయం కాదు అని అనిపిస్తే, ఆ సమయం లో ఉండే ఆవేశానికి ఆహుతి అవ్వకూడదు. సరె నేను అర్ధం చేసుకోగలను, అందరికి అది భయమా, ఆవేసమా వేరు చేయటం సులువు కాదు. అలాంటప్పుడు మరియు మన పనిలో ఏదో చిన్న తప్పయిన ఉంది అని అనిపించినప్పుడు అసలు ఆలోచించకుండా మనకి బాగా దెగ్గరయిన వాళ్ళని అడగాలి. దీనిలో ఒక తిరకాసు ఉంది, మనం చేసే పని ఒక వేళా తప్పు అయితే మనవాళ్ళు మన బాగోగులు కోరి వద్దు అని నిర్మొహమాటముగా చెబుతారు. మల్లి మనిషి సహజం, వద్దు, లేదు, కుదరదు మొదలైన పదాలు వినడానికి ఇష్టపడము. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ లో "ఇగో అడ్డొస్తుంది".

అప్పుడు మన మనసు మనతో అదే నాటకానికి బాలవ్వకుండా, కనీసం వాళ్ళు ఎందుకు ఆగ మంటున్నారు అనేది అలోచించాలి. ఆలోచించడం అంటే అప్పటికప్పుడు కొంచం అలోచించి మనకి ఉన్న ఆవేశాన్ని కొంచమన్న చల్లార్చుకొని ఒక రోజు ఆగి మల్లి ఇంకోసారి అలోచించి దాని తరువాత కూడా మనకి(మనసుకి బుర్రకి రెండిటికి ) అనిపిస్తే ఆ పని చేసేయాలి.

ఇక్కడ నేను మనవళ్ల అభిప్రాయాలను తీసి అవతల పడేయమనటం లేదు - నా ఉద్దేశం, మనకి ఎంత దెగ్గర వాళ్ళయినా, వాళ్ళకి మనలో ఒక తెలియని కోణం ఉంటుంది. అంతెందుకు మనలో మనకి తెలియని కోణాలు చాల ఉంటాయి అవి కొత్త పరిస్థితులు, పరిచయాలు మొదలైనవి బయట పెడుతాయి. ఆలా బయట పెట్టినప్పుడు మనమే మనలో ఆ కోణాన్ని చూసి ఆశ్చర్యపోతాము. నేనేమంటున్నాను అంటే, చివరికి మనమే నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనవాళ్ళ సలహాలలో వాళ్ళ వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టి ఆలోచించాలి.

అందుకే మన చుట్టూ మన అనుకున్న వాళ్ళు సరిగ్గా ఆలోచించేవాళ్ళు అయ్యుండాలి లేక పోతే అగ్నికి ఆజ్యం పోసినట్లే. ఈ విషయంలో మరియు ఇలాంటి సందర్భాలలో నేను చాల అదృష్టవంతుడిని నాకు చాల దేగ్గరైన స్నేహితులు ఉన్నారు(అన్ని విషయాలు ఇంట్లో చెప్పలేము కదా 😉).

ఇవాళ నేను ఒక సందర్భములో వాళ్ళ దెగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన సలహాలు నా ఆలోచనలను సరైన వైపు మరలించాయి. ఈ సందర్భముగా నేను ఇవాల్టి విషయములో వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నాను: సందీప్, విగ్నేష్, దివ్య - రేయ్ చాల చాల థాన్స్క్ రా. మీరు లేక పోతే నేను ఇవాళ ఆవేశంలో నిర్ణయం తీసుకునే వాడినిఏమో.

మీ

అనివర్త్

links

social